మెంటాడ పిఏసిఎస్ అధ్యక్షుడిగా గొర్లె ముసలి నాయుడు

మెంటాడ: సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మెంటాడ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు తెలిపారు. గురువారం స్థానిక మెంటాడ పిఎసిఎస్ కార్యాలయంలో అధ్యక్షులు గా గొర్లె ముసలి నాయుడు డైరెక్టర్ గా రెడ్డి ఆదినారాయణ. మణిపూరి రామచంద్రుడు బాధితుల స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ముసలి నాయుడు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రుణాలు మంజూరు చేస్తూ పిఎసిఎస్ అభివృద్ధి పథంలో నడిపిస్తానున్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలా చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి రెండేళ్లలో ముసలి నాయుడు పేరున తర్వాత రెండేళ్లు రెడ్డి ఆదినారాయణ అధ్యక్షులుగా వ్యవహరించేలా పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరుకు పార్లమెంటు ఉపాధ్యక్షులు గెద్దఅన్నవరం రాయపల్లి గౌరీ శంకర్ రాయిపల్లి రవిశంకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సత్యనారాయణ పిఎసిఎస్ సీఈవో వెంపడాపు ప్రసాద్ సొసైటీ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version