కంటకాపల్లి-అలమండ రైల్వే స్టేషన్ల మధ్యలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని విజయనగరం రైల్వే ఎస్‌ఐ బాలాజీ రావు ఆదివారం తెలిపారు. ఆమె వయసు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. గ్రీన్, పసుపు, ఆరంజ్ రంగులతో కూడిన నైటీ ధరించి ఉందని పేర్కొన్నారు. పై ఫొటోలో ఉన్న మహిళను ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని కోరారు.