గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్లు APSDMA తెలిపింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఆదివారం ఉదయం రగంటలకు వరద ప్రవాహం 6.72 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు చెప్పింది. రాత్రి 7గంటలకు ఇన్&ెట్ ఫ్లో 6.28 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు వివరించింది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లకు (112, 1070, 18004250101) కాల్ చేయాలని కోరింది.