ఘనంగా బొత్స గారి జన్మదిన వేడుకలు

3 చోట్ల నిర్వహించిన చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ).

ఈరోజు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రివర్యులు గౌ ll శ్రీ బొత్స సత్యనారాయణ (సత్తిబాబు)గారి జన్మదిన వేడుకలను ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఉత్తరాంధ్ర ఇల వేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించి బొత్స సత్తి బాబు గారి పేరు మీద పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం పేదవారికి చీరలు, ప్రసాదం పంపిణీ చేశారు.తదనంతరం విజయనగరం లోని డెఫ్ & డంబ్ స్కూల్ లో కేకు కట్ చేసి స్కూల్ పిల్లలoదరికి బ్యాగ్స్ పంపిణీ చేసి, అందరికి మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు. అనంతరం సిరిసహస్ర రైసింజ్ ప్యాలస్ నందు ప్రదీప్ నాయుడు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) కేకు కటింగ్ చేసి, సుమారు 100 మంది నిరుపేదలకు కిరాణా సామాగ్రిని పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమం లో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version