కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సమ్మె పోరాటం.

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య

 

కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత దేశాన్ని కేవలం ఇద్దరు గుజరాతీయులు అదానీ, అంబానీల శ్రేయస్సు కోసం మాత్రమే పరిపాలన ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య విమర్శించారు.
బుధవారం ఉదయం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ కేంద్ర కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా సంఘాల పిలుపు మేరకు విజయనగరంలో స్థానిక గంట స్థంభం నుంచి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ముగింపు సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సమ్మెకు ముఖ్య అతిథిగా హాజరైన జి ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. బిజెపి మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత 44 కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్ లుగా చట్టాల్లో మార్పులు చేసి వేతన జీవులను కార్పొరేట్, పారిశ్రామికవేత్తలకు బానిసలుగా చేయడానికి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్‌ కోడ్‌లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలంలో ఎందరో కార్మికులు ప్రాణాలు త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న 8 గంటల పని హక్కుని సైతం పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. 73 షెడ్యూల్లోని కార్మికులు మునిసిపల్ అంగన్వాడి ఆశా తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక చిరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వీరి సమస్యలపై నిరసన తెలుపుకొనే అవకాశం కోల్పోతారన్నారు. ఇది ఒక రకంగా దేశంలో నిర్బంధ నిరంకుశ విధానాలను అవలంభించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లోడింగు అన్లోడింగ్, కాల్ గ్యాస్ డెలివరి బాయ్స్, ఆటో, హమాలి, వీధివిక్రయ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పచెపుతూ ఆదాని అంబానీ వర్గాల వారికి పన్నులు తగ్గిస్తూ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మోడీ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజున జరిగిన సమ్మె ద్వారా మోడీ ప్రభువ్వానికి ఒక హెచ్చరిక అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మిక హక్కులపై నిరంకుశ దాడులకు పాల్పడుతున్న కార్పొరేట్ వర్గాల తీరుపై ఉద్యమించడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయని అందులో భాగంగానే డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో అసమానతలు, పేదరికం పెరిగిపోతున్నాయని, పేదల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అదే జరిగితే కార్మికులు కట్టు బానిసలుగా మారిపోతారని అన్నారు. కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు,సమ్మె హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సాంకేతికత పేరుతో కార్మికవర్గం పై ఒత్తిడి పెంచుతున్నారని ఎనిమిది గంటల పని విధానం కుంటుపడుతోందన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు వర్క్ ఫ్రం హోం లో పేరుతో ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్మిక వర్గ హక్కులపై నిరంకుశ దాడులకు పాల్పడుతున్న పాలకవర్గాల తీరును ప్రతిఘటించడం కోసం కార్మిక,ఉద్యోగ వర్గాలు ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతాంగ హక్కులపై ప్రయోగించడానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారని రైతు సంఘాల సుదీర్ఘ సమరసిల పోరాటాల ఫలితంగా కేంద్రం దిగివచ్చి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అన్నారు. పంటల గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని రైతాంగం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ రకమైన వైఖరిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ప్రజలను మోసగించే చర్యలకు పాల్పడుతుందన్నారు. సమస్యల నుండి ప్రజల దృష్టిని మరలించడం కోసం మతతత్వ రాజకీయాలకు మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ల పరం చేసి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు కార్మిక వర్గం ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు లు కార్మికులను ఉద్దేశించి సమ్మె కార్యక్రమంలో హాజరై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్రవంతి, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. నాగభూషణం, ఎ.ఐ.వై.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, బ్యాంక్ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ, ఎఐబిఇఎ జిల్లా అధ్యక్షుడు బి.వి ప్రసాద్, రవికుమార్, శ్రావణ్, ఏఐటీయూసీ నాయకులు ఆల్తి మారయ్య, మజ్జి ఆదిబాబు, ఏ.రాములు, విజయనగరం పట్టణంలో పి.డబ్ల్యూ మార్కెట్ కార్మికులు, కాల్ గ్యాస్ కార్మికులు, డాల్ మిల్స్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, టింబర్ మార్కెట్ కార్మికులు, డిసిఏంఎస్ కార్మికులు, మహేశ్వరి ఫ్లోర్ మిల్, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, సిమెంట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి భద్రత లేకపోయిన పీడిత ప్రజల కోసం నిలబడుతున్న జర్నలిస్టు కార్మికులు ఈ రోజు జరిగిన కార్మికవర్గ సమ్మె పోరాటాన్ని అధికారంతో కళ్ళు మూసుకుని చలనం లేకుండా ఉన్న ప్రభుత్వ పాలకుల కళ్ళకి కనిపించేట్టు, వారి చెవులకి పట్టిన తుప్పుని వదలగొట్టడానికి పదునెక్కిన కలంతో, ఎరుపెక్కిన కేమెరా కళ్ళతో కార్మికులలో కలిసి అడుగులేసిన జర్నలిస్టు కార్మికులకు

Exit mobile version