TTD ఏఈఓ రాజశేఖర్‌ బాబు సస్పెండ్‌ 

TTDలో పనిచేసే అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (AEO) రాజశేఖర్‌ బాబు సస్పెండ్‌ అయ్యారు.
తిరుపతి(D)లోని స్వగామం పుత్తూరులో ఆయన ప్రతి ఆదివారం చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని TTDకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన TTD విజిలెన్స్‌ అధికారులు రాజశేఖర్‌ ఆలయ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని గుర్తించారు. ఇతర ఆధారాలూ పరిశీలించిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్‌ చేశారు.

Exit mobile version