జూలై 9వ తేదీన చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి నాయకులు రంగరాజు పిలుపునిచ్చారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు సమ్మెకు సంబంధించిన గోడపత్రికలను సోమవారం ఆవిష్కరించారు. రంగరాజు మాట్లాడుతూ… కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.