ముద్రాపక రాష్ట్ర సంఘంలో రాజాకి చోట


విజయవాడ జూలై6: స్థానిక వివాన్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్సు అసోసియేషన్ విజయవాడ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విస్త్రత కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షులు పి. బసవయ్య అధ్యక్షత వహించగా జాతీయ సంఘ ఉపాధ్యక్షులు రవీంద్రబాబు వ్యాఖ్యానం చేసారు. రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రతినిధులు హాజరై వ్యాపారాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తెచ్ఛారు.
విజయనగరానికి చెందిన పెంటపాటి రాజా తదితరులను రాష్ట్ర కార్యవర్గం లోకి తీసుకున్నారు. విజయనగరం సంఘ అధ్యక్షుడు నమ్మి ప్రసాద్ గతంలో వృత్తిపన్ను సమస్యపై తాము చేసిన కృషిని వివరించారు. ప్రధాన కార్యదర్శి మల్లీశ్వర్రావు, కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెఃడు నెలల అనంతరం తదుపరి సమావేశాన్ని పాలకొల్లులో జరపడానికి సమావేశం తీర్మానించింది.

Exit mobile version