‘మాట నెరవేర్చని వారిని ఏం అంటాం.. మోసగాళ్లు కాదా, ప్రజాస్వామ్యంలో ఒక్కరోజైనా పరిపాలించే హక్కు వీళ్లకు ఉందా..ఈ విషయాన్ని ప్రజల ముందే తేల్చుకుందాం’ అంటూ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి కొండపల్లి స్పందిస్తూ ‘బొత్స ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు..ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్డెనా వేశారా… ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా’ అని కౌంటర్ ఇచ్చారు.