*చిన్న శ్రీను గారి ఇంటికి కురసాల*

ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవ నీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి నివాసం అయిన సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో శనివారం అల్పాహారం విందుకు మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ కురసాల కన్నబాబు గారు అల్పాహార విందుకు హాజర య్యారు. అతనితో పాటు మాజీ అరుకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బొడ్డేటి మాధవి గారు, మరియు మాజీ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మరియు ప్రస్తుత అరకు పార్లమెంట్ పరిశీలకులు శ్రీ బొడ్డేటి ప్రసాద్ గారు ఉన్నారు.
ముందుగా ప్రదీప్ నాయుడు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) కురశాల కన్నబాబు గారికి పుష్ప గుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆహ్వానం పలికారు. అనంతరం పార్వతీపురంలో జరిగే విస్తృతస్థాయి సమావేశానికి పయనమయ్యారు.

Exit mobile version