వాట్సప్‌కు ఈ లింక్‌ వస్తే ఓపెన్‌ చెయ్యోద్దు

పీఎం కిసాన్‌ యోజన పేరుతో సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొడుతున్నారు. ఫోన్‌ వాడుతున్న వ్యక్తికి తెలియకుండానే వారి కాంటాక్ట్‌ లిస్టులో నంబర్లకు ఏపీకే లింక్‌ పంపిస్తున్నారు. అలాంటి లింక్‌ వస్తే ఎవరూ ఓపెన్‌ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురి ఫోన్‌ నంబర్ల నుంచి ఇలానే లింక్‌లు షేర్‌ చేయగా వెంటనే అప్రమత్తమయ్యి డిలీట్‌ చేశారు.
Share it…

Exit mobile version