విజయనగరంలో త్వరలో ఏర్పాటు చేయనున్న జోన్ల విధానానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కోరారు.
బుధవారం ఆయన ఛాంబర్‌లో ట్రాఫిక్, వన్ టౌన్, టూ టౌన్ ఇన్సె ఎక్రగ్లు, ప్రణాళిక విభాగం అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరణకు మూడు జోన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.