*బుక్ డిపో సెంటర్ నిర్వాహుల సేవలు అమూల్యం *

గ్రంథాలయోధ్యమ నాయకులు జయంతి రామలక్ష్మణ మూర్తి జయంతి సందర్బంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం, జిల్లా గ్రంథాలయ సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం నాడు గురజాడ కేంద్ర గ్రంథాలయంలో బుక్ డిపో సెంటర్ నిర్వాహకులను ఘనంగా సత్కరించారు. ముందుగా రామలక్ష్మణ మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయ ఉద్యమానికి జయంతి రామలక్ష్మణ మూర్తి చేసిన సేవలను కొనియాడారు. వారి స్ఫూర్తితో గ్రంథాలయల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వున్న బుక్ డిపో సెంటర్ లను తక్కువ జీతాలు అయినప్పటికీ సేవా దృక్పధంతో వాటిని నిర్వహిస్తున్న నిర్వాహకుల సేవలు ప్రశంస నీయమని, గ్రంథాలయల అభివృద్ధిలో వారి పాత్ర గొప్పదని అన్నారు. అనంతరం బుక్ డిపో సెంటర్ నిర్వాహకులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా NSS పి. ఒ. చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సేవా సంఘం వ్యవస్థాపకులు అబ్దుల్ రవుఫ్, ఉపాధ్యక్షులు కె. దయానంద్, జిల్లా కళాశాలల గ్రంథాలయల కన్వీనర్ బి. రామభద్రరాజు, పట్టణ కన్వీనర్ ప్రసాద్ పట్నాయక్, బాషా, దాసరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version