ఉచిత ప్రవేశాలను నిరాకరిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం ఉచిత ప్రవేశాలను అమలు చేయని బీసెంట్, సన్ స్కూల్, భాష్యం, డిల్లీ పబ్లిక్ స్కూల్తో సహా ఆరు పాఠశాలలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, సంబంధిత పాఠశాలలపై తనిఖీలు ప్రారంభించారు. ఈ చర్యలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలలకు గట్టి హెచ్చరికగా నిలుస్తున్నాయి