అధికారులు హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారమైనప్పుడే రిలే నిరాహార దీక్షలు విరమిస్తామని అప్పటివరకు వివిధ రకాలుగా ధర్నాలు నిర్వహిస్తూనే ఉంటామని జనసేన మండల అధ్యక్షుడు సబ్బరపు రాజశేఖర్ అన్నారు. బిరసాడ వలస గ్రామానికి ఆనుకుని ఉన్న కోళ్ల ఫారం తొలగించాలని దుర్వాసన భరించలేక నరకం అనుభవిస్తున్నామని గ్రామం నుండి కోళ్ల ఫారం తొలగించాలని జనసేన నేత సబ్బరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో గత 20 దినాల నుండి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో అధికార ప్రతిపక్ష పార్టీలనే భావన లేకుండా గిరిజన ప్రజలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించి ధర్నాలో పాలుపంచుకుంటున్నారు. కోళ్ల ఫారం తొలగించాలని ఇన్ని దినాలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో సోమవారం తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడంతో అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయించి ఆ గిరిజన గ్రామానికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అయినా వారిపై పూర్తి నమ్మకం లేకపోవడంతో రిలే దీక్షలు, ధర్నాలు కొనసాగుతాయని రాజశేఖర్ తెలిపారు. నిన్నటి వరకు వివిధ పార్టీ నాయకులు గ్రామ ప్రజలతో జరిగిన ధర్నా కు మద్దతుగా సుమారు ఐదు గ్రామాల పెద్దలు, ప్రజలు పాల్గొనడంతో ఈ సమస్య జటీలమెయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు షికారులు కొడుతున్నాయి. అందుకు బలం చేకూర్చే విధంగా మెంటాడ గ్రామ పెద్దలు వివిధ వర్గాలకు చెందిన నాయకులు కోళ్ల ఫారం తొలగించాలని మద్దతు పలికారు. కోళ్ల ఫారం నుండి వచ్చే వ్యర్ధాలు మెంటాడ లో గల అనంతసాగర్ చెరువులోకి చేరడంతో అక్కడ ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని లక్షలు విలువ చేసే చేపలు చనిపోతున్నాయని, చెరువు నీళ్ళు తాగి పశువులు జబ్బు పడుతున్నాయని వర్షాలు కారణంగా చెరువు నుండి చుట్టుప్రక్కలకు కూడా దుర్వాసనతో కూడిన నీరు ప్రవహిస్తుందని సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నీటి సంఘం అధ్యక్షులు రెడ్డి రాజగోపాల్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ కోళ్ల ఫారం నుండి వచ్చే దుర్వాసన దుర్గంధంతో గిరిజన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులకు ప్రభుత్వానికి ఉందని దానికి తోడు అనంతసాగర్ లో కలుస్తూ మెంటాడ ప్రజలకు ఇబ్బంది కరంగా ఉందని తక్షణమే కోళ్ల ఫారం తొలగించాలని తొలగించే వరకు యువకుడు జనసేన మండల అధ్యక్షుడు రాజశేఖర్ చేస్తున్న ఈ ఉద్యమానికి మా గ్రామం మద్దతు తెలుపుతుందని తెలిపారు. రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనం గూర్చి మేము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న అన్ని గ్రామ నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిరసాడ వలస గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.