* ఎస్.ఎఫ్.ఐ 18 అఖిల భారత మహాసభలను జయప్రదం చెయ్యండి…

* 55 ఏళ్లుగా ఎస్ఎఫ్ఐ అలుపెరుగని పోరాటం... -పి రామ్మోహన్

 

భారత విద్యార్ది ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 18 వ ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల పోస్టర్ ను స్థానిక ఎల్బీజీ భవన్ నందు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం ఆవిష్కరించడం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుండి 30 వరకు కేరళలో గల కొజికోడ్ లో అఖిల భారత మహాసభలు జరగబోతున్నాయి అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలని కోరుతున్న ఎస్ఎఫ్ఐ ఈ ప్రాంగణానికి పాలస్తినా నగర్ అని పేరును పెట్టి పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న దురాగతాన్ని చాటి చెబుతుందని తెలిపారు. ఈ మహాసభలలో విద్యారంగ సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చలు జరుగుతాయని, దానిలో భాగంగా నూతన విద్య విధానం 2020 ద్వారా వచ్చే విపత్తులు పై చర్చలు జరుపుతామని,అలాగే కొత్తగా తెస్తున్న జీవోలు విద్యావిధానాన్ని వెనక్కు నెట్టేలా ఉన్నాయని దానిలో భాగంగా పాఠశాలలు మూసివేసే జీవో నం.19.20.21 లను రద్దు చెయ్యాలని, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న విద్యావ్యవస్థకు వచ్చేపాట్లు మాత్రం మారడం లేదని ,గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేసిన ఇప్పుడు గత ప్రభుత్వ బాటలోనే నడుస్తూ విద్యావ్యవస్థని నాశనం చేసే పనులకు దారిస్తుంది అని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని వెనుకకు నెట్టేలా, ప్రయివేటు మరియు కార్పొరేట్ విద్యావిధానానికి ముందుకు తీసుకువెళ్లేలా ఈ ప్రభుత్వాల తీరు కనిపిస్తుందని తెలియజేసారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా చేస్తుంది అని అయితే ఈ రాష్ట్రం లో నిరుద్యోగ శాతం పెరుగుతున్నా పట్టించుకొని ప్రభత్వం ఉద్యోగంద్రా గా ఎప్పుడు చూపిస్తారని, నిరక్ష్యారస్యత అధికంగా వుంది మరి విద్యాంధ్ర గా ఎప్పుడు తీర్చిదిద్దుతారు అని ప్రశ్నించారు. చాలా మందికి వైద్య సదుపాయాలు అందడం లేదు అలాంటప్పుడు ఆరోగ్యాంధ్రా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించారు. దానితోపాటుగా విజయనగరం జిల్లా ప్రభుత్వానికి, ఎస్ఎఫ్ఐ విద్యారంగా సమస్యలను అనేకసార్లు తెలియజేస్తున్న పట్టించుకొవడం లేదని కచ్చితంగా సమస్యల పరిష్కరానికై ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుందని తెలిపారు. కావున ఈ అఖిల భారత మహాసభలను మేధావివర్గం,విద్యార్థులు ప్రజలందరు జయప్రదం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీఎచ్ వెంకటేష్ మరియు జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు వి చిన్నబాబు, జే రవికుమార్,పి.రమేష్ తదితరులు పాల్గొన్నారు…

Exit mobile version