విజయనగరం,శుక్రవారం, జూన్20th.

అంతర్జాతీయ యోగా దినోత్సవం,జూన్ 21st, శనివారం పురస్కరించుకొని శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో యోగ దినోత్సవాన్ని నిర్వహించారు.

ముందుగా క్లబ్ యోగా గురువు చక్రధర్ పట్నాయక్ యోగా యొక్క విశిష్టతను సభ్యులందరికి వివరిస్తూ ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ క్రీస్తు పూర్వం రెండువందల సంవత్సరాల క్రితం పతంజలి రచించిన యోగ నేడు విశ్వజనీనమై ప్రపంచంలో సుమారు 180 దేశాలకు పైగా యోగ వినియోగప్రక్రియ వెలుగొందుతుందని,యోగ అనేది ఏ కులానికో, మతానికో చెందింది కాదని, యోగాతో చ‌క్క‌ని ఆరోగ్యాన్ని సాధించ‌వ‌చ్చున‌ని, యోగాభ్యాసాలు నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాల‌ని,శారీక‌, మాన‌సిక ఆరోగ్యాన్ని సాధించేందుకు యోగా దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారుఅన్నారు.

డిస్ట్రిక్ట్ 102 ఎలక్ట్ గవర్నర్ ఎ. తిరుపతి రావు,క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎస్ ప్రకాశరావు మాష్టారు మాట్లాడుతూ మంచి ఆరోగ్యం కోసం ప్రతీ ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా ధ్యానం, యోగాసనాలు వేయాలని, కరోనా సంక్షోభ కాలంలో యోగా ప్రముఖ్యతను ప్రపంచదేశాలు గుర్తించాయని, యోగాలో ప్రాణామాయ ప్రక్రియ మనిషిలో రోగనిరోధక కణాలను పెంచి, రక్తప్రసరణ బాగాజరిగి, ఊపిరితిత్తులు బలోపేతమై ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు.

అనంతరం క్లబ్ యోగ గురువు చక్రధర్ పట్నాయక్ క్లబ్ సభ్యులచే యోగాసనాలు వేసి, వేయించి ఆసనాలపై అవగాహన కల్పించారు. చివరగా యోగా గురువు చక్రధర్ పట్నాయక్ కు వాకర్స్ క్లబ్ పెద్దలంతా ఘనంగా సత్కరించారు.

~త్యాడ రామకృష్ణారావు(బాలు)

Exit mobile version