“పాత బకాయిలు చెల్లించి సీట్లను భర్తీ చేయాలి “

 పేదవిద్యార్థులకు 25 శాతం ఉచిత విద్యనందించే పథకం క్రింద ప్రైవేటు పాఠశాలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించి కొత్త సీట్లను భర్తీ చేయాలని ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ… కలెక్టర్‌ చేసిన ఉచిత విద్యకు సంబంధించిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.
ఉచిత విద్యకు చెల్లించాల్సిన నిధులు మంజూరు చేయకపోతే రెండు వైపుల తల్లిదండ్రులు నలిగిపోవాల్సి వస్తుందన్నారు.

Exit mobile version