అకౌంట్లలోకి రూ.13,000.. జమ ప్రారంభం 

 

తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్దిచేకూరనుంది.
ఇవాళ సాయంత్రానికి ప్రక్రియ పూర్తవనున్నట్లు అంచనా.
సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితా ఉంటుంది.
ఈ నెల 20 వరకు అభ్యంతరాలు పంపొచ్చు. జూన్‌ 30న తుది జాబితా ప్రదర్శించి మిగిలిన అర్హులకు జులై 5న నగదు పంపిణీ చేస్తారు.

Exit mobile version