బుధవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు .విజయనగరం జిల్లా పరిధిలో గల విద్యార్థిని విద్యార్థులకు మరియు ఎం ఎస్ టి పాసులపై తిరుగు ప్రయాణికులకు కొన్ని సాంకేతిక కారణముల దృష్ట్యా తే 12-06-25 మరియు 13-06-25 ది లలో నిలుపుదల చేయడం జరిగినదని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలియజేశారు. కావున విద్యార్థినీ విధ్యార్థులు అందరూ ఈ అసౌకర్యానికి సహకరించగలరు. 14.06.2025 ఉదయం 08.00గం. ల నుండి యదావిధిగా బస్సు పాసులు జారీ చేయబడునని తెలిపారు.
విద్యార్థులు అందరూ కూడా ముందుగా www apsrtcpass.in వెబ్సైటు లో వారి యొక్క వివరములు నమోదుచేసుకొని బస్ పాస్ కౌంటర్ వద్దకు వచ్చిన యెడల త్వరగా బస్ పాసులు జారీ చేయబడతాయని
డిపో మేనేజర్ తెలిపారు.