విజయనగరం ప్రభుత్వ కళాశాలలో ఎనాటమీ విభాగంలో ఎనా ఫెస్ట్-2025 కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ కె.పద్మలీల హాజరై వేడుకులను ప్రారంభించారు. విద్యార్థులు శరీర భాగాల పెయింటింగ్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వైద్య విద్యార్థులు నిత్య విద్యార్థులని, ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.