*కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన సాధ్యం* * *ఇచ్చిన హామీలను సకాలంలో పూర్తి చేసిన ఘనత కూటమిదే* * మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు మెంటాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ సుపరిపాలన అందుతుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారీ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పండగ వాతావరణం లో టిడిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ముగ్గురు త్రిమూర్తులైన నరేంద్ర మోడీ పాలనలో దేశం, అత్యంత అందగ్యుడైన చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రం, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతూ సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకుగాను ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, వారిని అన్ని విధాలుగా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరుకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గెద్ద అన్నవరం సిరిపురం గురు నాయుడు మేడపల్లి యం.పి.టి.సి రెడ్డి ఎర్రి నాయుడు మాజీ విప్ రామలింగేశ్వర రావు కుంచు వెంకట్ కొరిపిల్లి అప్పలరాజు కొయ్యన గణేష్ దొడ్డి దేవుడు వసాది సతీష్ టిడిపి కార్యకర్తలు సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Share this:Post Click to share on WhatsApp (Opens in new window) WhatsApp More Click to print (Opens in new window) Print Click to email a link to a friend (Opens in new window) Email