బాలిక ఫొటోలు మార్పింగ్‌.. యువకుడి అరెస్ట్‌

రామభద్రపుపురానికి చెందిన బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. బొబ్బిలి DSP
భవ్యారెడ్డి కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు.
మెరకముడిదాం(M) బుదరాయవలసకు చెందిన యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 15 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. ఆమెను పలుమార్లు డబ్బులు అడగ్గా నిరాకరించింది. AI సాయంతో ఫొటో మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Exit mobile version