హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజువారీగా జరుగుతున్న ప్రసవాలను నమోదుచేసి ఆయా ఆసుపత్రుల నుంచి ప్రతి రోజూ సమాచారం సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు. లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం కలెక్టరేట్లో జరిగింది. స్కానింగ్ కేంద్రాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.