సారారహిత జిల్లాగా విజయనగరం: కలెక్టర్‌

జిల్లాలోని అన్ని గ్రామాలను, మండలాలను సారారహితంగా గుర్తించి విజయనగరం జిల్లాను సారారహిత ప్రాంతంగా ప్రకటిస్తూ నవోదయం కమిటీలో తీర్మానం చేసినట్లు కలెక్టర్‌ అంబేద్కర్‌ తెలిపారు.
నవోదయం 2.0 అమలుపై జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్చించారు. జిల్లాలో బెల్టు షాపులు అధికంగా వుంటున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని నియంత్రణ చేయాలన్నారు.

Exit mobile version