“జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం”

సామాజిక రుగ్మతల నుంచి ప్రజలను చైతన్యపరిచే దిశగా జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డీవీజీ.శంకర్రావు అన్నారు.
ఆదివారం విజయనగరంలో ఎంవీఆర్‌ కృష్ణాజీ అధ్యక్షతన జరిగిన జేవీవీ జిల్లా మహాసభల్లో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన సమాజంలో ప్రజలు నేటికీ మూఢవిశ్వాసాలను నమ్ముతున్నారన్నారు. వీటికి ప్రజలను దూరం చేయాలన్నారు.

Exit mobile version