“ఘనంగా నీలమ్మ సంబరాలు”


చీపురుపల్లి మే23: నిమ్మలవలస గ్రామ
ఇలవేలుపు శ్రీ నీలమ్మతల్లి సంబరం భక్తి శ్రద్ధలతో లక్ష్మి, శుక్రవారాలు రెండురోజులు జరిగింది. కీర్తిశేషులు బర్ల బుచ్చి, పార్వతి దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారులు నీల, లక్ష్మణరావు తదితరులు ఊరి బాగుకోసం ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభోగంగా నిర్వహించారు. వ్యవసాయం కళలు క్రీడారంగాలలో గుర్తింపు పొందిన నిమ్మలవలస గ్రామంలో వందేళ్ళకు పైగా నీలమ్మ సంబరాల సాంప్రదాయం కొనసాగుతోంది. కార్యక్రమాలకు ఖర్గుపూర్ నాగ్పూర్ తూర్పుగోదావరి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి, అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. సాయంత్రం వరకు అమ్మవారి ఊరేగింపును
డప్పులమోతలతో కళశాలతోనిర్వహించారు.
ఈ సందర్భంగా ఊరంతా సందడి చేసిన శ్రీకాకుళం జైదుర్గమ్మతల్లి కోలాటబృందం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎన్ కోటి ఆధ్వర్యంలోని ఈ బృందంలో చిన్నారి కోల వైష్ణవి పలువురి ప్రశంసలు పొందింది. రాత్రి మొక్కుబడులు నిర్వహించుకున్న అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. రాత్రి 10గంటలకు ఆగూరుకంచరాం బృందంవారిచే బుర్రకధ ప్రదర్శించబడింది.
శుక్రవారం భక్తులకు అన్నసంతర్పణ చేసారు.

Exit mobile version