తీర్పు రిజర్వ్‌ చేసిన విజయనగరం జిల్లా కోర్టు

ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్‌, సమీర్‌ కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఉగ్ర లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో విశాఖ సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న సిరాజ్‌, సమీర్‌లను వారం రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగించాలని విజయనగరం జిల్లా కోర్టుని పోలీసులు నిన్న సాయంత్రం ఆశ్రయించారు.
మంగళవారం వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం, రేపు వెల్లడించనుంది. నిందితులను కస్టడీకి ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version