విజయనగరంలో అరెస్టైన ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌లను న్యాయస్థానం ఆదేశాల మేరకు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిపై ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్, అన్‌లాఫ్‌ఎక్టివ్ ప్రివెన్షన్ యాక్ట్ క్రింద కేసులు నమోదయ్యాయని జైల్ సూపరిండెండెంట్ మహేశ్‌బాబు తెలిపారు. వీరి ఇరువురిని విడివిడిగా సెల్ఫ్‌లో ఉంచినట్లు, సీసీ కెమెరాలను నిఘాలో పర్యవేక్షిస్తున్నామన్నారు