బ్లాస్టింగ్ మెటీరియల్ అమ్మకాలకు విజయనగరం పాత అడ్డాగా తయారయింది! అక్రమంగా నిలవచేసిన ప్రేలుడు పదార్ధం కారణంగా గతంలో కన్యకాపరమేశ్వరి గుడి ప్రాంతంలో పెనుప్రమాదం సంభవించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా వాటిల్లింది! మావోయిస్టులకు కూడా ప్రేలుడు పదార్ధాలు ఇక్కడి నుండే అమ్మకం అవుతుంటాయని జనం అనుకుంటుంటారు. జిలెటిన్ స్టిక్సు, ప్రేలుడు పదార్ధాలను క్వారీలకు ప్రభుత్వ అనుమతితో విజయనగరంలో విక్రయిస్తుంటారు. ఈ తరహా వ్యాపారం చేసేవారు కొందరు ఉగ్రవాదులకు ప్రేలుడు పదార్ధాలు సరఫరా చేయడానికి అవకాశముంది? ఇటీవల విజయనగరం, హైదరాబాదులలో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదులు విజయనగరంలోనే ప్రేలుడు పదార్ధాలు కొనుగోలు చేసారని వార్తలు వెలువడడం గమనార్హం! Be alert…! -యాగంటి రవి. Share this:Post Click to share on WhatsApp (Opens in new window) WhatsApp More Click to print (Opens in new window) Print Click to email a link to a friend (Opens in new window) Email