నేడు భారీ వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే సత్యసాయి జిల్లాలో మోస్తరు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Exit mobile version