భారత త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగ ర్యాలీ NDA (BJP TDP JSP) కూటమి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి

మన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగించిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ లో మన భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన విజయానికి ప్రతీకగా మన విజయనగరం జిల్లా కేంద్రంలో మే 16 వ తేది శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు విజయనగరం కోట జంక్షన్ నుండి తిరంగా ర్యాలీని NDA (BJP TDP JSP) కూటమి సారధ్యంలో రూపొందించడం జరిగింది.

కావున ఈ కార్యక్రమంలో మన NDA (BJP TDP JSP) కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీలకు అతీతంగా మన మిత్రులను మరియు పరిచయం ఉన్నవారిని అందరిని ఆహ్వానించవలసినదిగా మనవి

సూచన : పార్టీ జెండాలు, కండువాలు ధరించరాదు. కేవలం మన (తిరంగ) జాతీయ జెండాను మాత్రమే ఏర్పాటు చేసుకోవలెను.

ఇట్లు,
*ఇమంది సుధీర్,*
భారతీయ జనతాపార్టీ,
విజయనగరం అసెంబ్లీ.

Exit mobile version