గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది – మంత్రి సంధ్యారాణి

సచివాలయం ప్రారంభోత్సవంలో మంత్రి

మెంటాడ: గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గ్రామాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతుందనీ స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కొండ లింగాల వలస గ్రామంలో మంగళవారం నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామంలోని కొన్ని మౌలిక వసతులు అవసరమని వాటిపైనే ప్రభుత్వ దృష్టి పెట్టిందని రోడ్లు, కాలువలు ,వంతెనల సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గ్రామ పంచాయితీలలో సర్పంచ్ కు పూర్తి అధికారం కట్ట పెట్టడం వలన అభివృద్ధికి బాధ్యులను చేసిన వారిమీ అవుతామని కూటమి ప్రభుత్వం గుర్తించి వారికి మొదటి ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు తెలిపారు. గత 40 సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాలలో కనీసం రోడ్డు సదుపాయం లేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా గ్రామాల అభివృద్ధిలో మొదటి భాగంగా మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు ప్రతి గిరిజన గ్రామాలలో ఉన్న పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకోవచ్చని తెలిపారు. కొండ లింగాల వలస గ్రామం నా సొంత గ్రామం కాబట్టి మండలాన్ని అభివృద్ధి కొరకు నా వంతుగా కృషి చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమానికి రాగా కేవలం మెంటాడ మండలానికి 100 కోట్లు వరకు పనుల రూపంలో ఇవ్వడం జరిగిందని ప్రతి గ్రామంలో రోడ్లు, విద్యా, వైద్య వివిధ రంగాలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి గిరిజన గ్రామాల్లో కూడా పిల్లలు ను స్కూలుకి పంపించి చదివించాలని మంచి చదువు చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని తద్వారా గ్రామాలు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడుస్తాయని తెలిపారు. అభివృద్ధితో పాటు ఎన్నికలలో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తామన్నారు. అమ్మకు వందనం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడికి 15000 15 రోజుల్లో ఇవ్వడం జరుగుతుందని, త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని, విత్తనాలు ఎరువులు ప్రజలకు అందుబాటులో ఉండేలాగున రైతు సేవా కేంద్రాలలో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఒక్కసారిగా రాష్ట్రంలో 16,500 డీఎస్సీ పోస్టులు మంత్రి నారా లోకేష్ తీయడం అందులో ఎస్టి కులస్తులకు 2023 పోస్టులు అవకాసం కల్పించడం జరిగిందన్నారు. ఇంతకంటే గిరిజన అభివృద్ధికి ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు, గొర్లె ముసలి నాయుడు, గెద్ద అన్నవరం, ఎంపీటీసీ గుమ్మడి ప్రవీణ్ ,ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సింహాచలం, గ్రామ సర్పంచ్ పాడి వరహాలమ్మ,కూటమి పార్టీ నాయకులు, ఎంపీడీవో భానుమూర్తి, హౌసింగ్ ఏఈ మహేశ్వర రావు, పంచాయితీ రాజ్ జేఈ గౌతమ్, ఎంఈఓ శివాజీ వర్మ, ఏపీవో చిన్నప్పయ్య , ఏవో గోకుల్ కృష్ణ, వివిధ శాఖల అధికారులు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version