
జల్లా గ్రంథాలయ సేవా సంఘం నిర్వహిస్తున్న పుస్తకహుండీ కార్యక్రమానికి దాతల నుండి విశేష స్పందన లభిస్తుందని సంఘం ఉపాధ్యక్షులు కె. దయానంద్, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్ లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు తన ఇంట్లో వున్న వివిధ రకాల పుస్తకాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో తమను సంప్రదించిన మేరకు వారి ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామని అన్నారు. పుస్తక హుండీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, ఇలా సేకరించిన పుస్తకాలను వివిధ గ్రంథాలయాలకు, విద్యార్థులకు అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు వేలాది పుస్తకాలను దాతల నుండి సేకరించామని అన్నారు. ప్రతీ ఒక్క పుస్తకం సద్వినియోగమయ్యేలా అవసరమైన వారికి వాటిని అందజేశామని, ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లల్లో చదివి వదిలేసిన పుస్తకాలను పుస్తకహుండీకి అందజేసేందుకు ముందుకు రావాలని కోరారు. సెల్ ఫోన్ ప్రభావంతో అన్ని వయసుల వారు పుస్తక పఠనానికి దూరమవుతున్న నేపథ్యంలో మరలా పుస్తక పఠనంపై ఆశక్తి పెంపొందించేలా, గ్రంథాలయాల వైపు నడిపించేలా సంఘం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.