

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీజీ శంకర్రావు ఆదేశించారు.
విజయనగరంలోని తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ… పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రతపై ITDA అధికారులు దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.