A2Z सभी खबर सभी जिले की

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ ఆకస్మిక దాడులు

 

మెంటాడ మండలంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ విభాగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. లోతుగెడ్డ పంచాయతీ పరిధిలోని శ్రీ బాలాజీ ట్రేడర్స్ దుకాణంలో సిఐ సింహాచలం, కానిస్టేబుల్ తిరుపతి ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఇపిఓయస్‌లో నమోదు ఉన్న స్టాక్‌తో గోడౌన్‌లో ఉన్న స్టాక్ మధ్య ఆరు బస్తాల తేడా బయటపడింది.

ఈ నేపథ్యంలో ఆ దుకాణం ఎరువుల నమ్మకం (డీలర్‌షిప్)ను 15 రోజులు నిలిపివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించినట్లు ఏవో గోకులకృష్ణ తెలిపారు.

అదే విధంగా జయితి గ్రామంలోని శ్రీ వెంకట గణేష్ జనరల్ స్టోర్లో విజిలెన్స్ అధికారులు రికార్డులు పరిశీలించారు. అనంతరం టాక్ పాయింట్‌లో కూడా తనిఖీలు చేపట్టారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Related Articles
Show More
Back to top button