జిందాల్‌ నిర్వాసితుల ఫిర్యాదులపై తక్షణ విచారణ: కలెక్టర్‌

జిందాల్‌ భూ సేకరణలో నిర్వాసితులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూస్తామని కలెక్టర్‌ అంబేడ్కర్‌ హామీ ఇచ్చారు. చీడిపాలెం, ముషిడిపల్లి, చినఖండేపల్లి, కిల్తాంపాలెం, మూల బొడ్డవర గ్రామాలకు చెందిన 10 మంది రైతులు నష్టపరిహారం అందలేదని శనివారం ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ KRCC డిప్యూటీ కలెక్టర్‌ మురళిను విచారణాధికారిగా నియమిస్తూ నిజ నిర్ధారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశించారు.

Exit mobile version