‘జర్మనీలో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ’

జర్మనీలో నర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి కే.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. 35 సంవత్సరాల వయసు లోపు గిరిజన మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. బీఎస్సీ నర్సింగ్‌ చదివి రెండు సంవత్సరాల క్లినికల్‌ అనుభవం లేదా జిఎన్‌ఎమ్‌ నర్సింగ్‌ కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నంలో 8 నుంచి 10 నెలల పాటు శిక్షణ అందించి జర్మన్‌ భాషను నేర్పిస్తారన్నారు.

Exit mobile version